‘అలాయ్ బలాయ్’.. దసరా శుభాకాంక్షలు చెప్పండిలా.. - MicTv.in - Telugu News
mictv telugu

‘అలాయ్ బలాయ్’.. దసరా శుభాకాంక్షలు చెప్పండిలా..

October 23, 2020

పండగ వచ్చిందంటే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా గడిపే సందర్భం. తెలంగాణలో అయితే రెట్టింపు సంబరాలు ఉంటాయి. ఓ వైపు బతుకమ్మ, మరోవైపు దుర్గా దేవి పూజ, శమీ పూజలు ఇలా రకరకాల పద్దతులు ఉంటాయి. బంధు మిత్రులకు అలాయ్ బలాయ్ ఇచ్చి ఆటపాటలతో సందడి చేస్తారు. మరి ఈసారి దసరాను ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పి మరింత సంబరంగా జరుపుకోండి. 

1 . పది అంటే దశ రాత్రుల పండుగ.. 

పది తలల రావణాసురుడిపై రాముడు విజయం..

అందుకే ఈరోజు దస్ హరా.. 

చెడుపై మంచి విజయం సాధించిన రోజు…

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

2 . అసత్యంపై సత్యం విజయం..

అధైర్యంపై ధైర్యం విజయం..

అందుకే ఇది మనకు ఎంతో ప్రాముఖ్యం…

మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు..

3 . ‘విరాటనగరం రమ్యం గచ్ఛమానో యుధిష్ఠిరః

అస్తువన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీమ్

యశోదాగర్భసంభూతాం నారాయణవరప్రియాం

నందగోపకులేజాతాం మంగళాం కులవర్ధనీమ్

కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం

శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతిగామినీమ్’

మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు..

4.’ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే

సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః’

మీరు అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుకుంటూ.. 

దసరా శుభాకాంక్షలు..

 5.’దుర్లభం సర్వజంతునామ్ దేవిపూజా ఫలాధికా

దుర్గా, లక్ష్మీ మహాదెవ్యహ: పూజనీయ: ప్రయత్నత:

ఆశ్వయుజాస్మీ సమ్ప్రాప్త్యె ప్రతిపచ్చుభవాసరే

తధారభ్య ప్రయత్నెన నవరాత్రి పూజయెత్’ 

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు.