మారింది.. తెలంగాణలో దసరా సెలవు 26న..  - MicTv.in - Telugu News
mictv telugu

మారింది.. తెలంగాణలో దసరా సెలవు 26న.. 

October 23, 2020

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవు రోజును మార్చింది. ఈ నెల 26న పండగ సెలవు ఉంటుందని సాధారణ పరిపాలన విభాగం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి 25నే ఉంటుంది. దసరా సెలవు 25 అని ప్రభుత్వం ఇదివరకు ప్రకటించింది. అయితే కేంద్రంలోని మోదీ కేంద్ర ప్రభుత్వం 26వ తేదీని ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కేంద్రం మాదిరిగానే రాష్ట్ర సర్కారు కూడా 26ను సెలవుగా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవును మార్చింది. ఉద్యోగులకు శని, ఆది, సోమవారం మూడు రోజులు కలిసి వచ్చాయి. 

కరోనా లాక్‌డౌన్ కాస్తా అన్‌లాక్ కావడంతో ప్రజలు షాపింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఏపీ, ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్ నెపంతో ప్రైవేట్ బస్సులు దోపిడీకి తెరతీస్తున్నాయని, ఆర్టీసీ యాజమాన్యాలు పట్టింపులకు పోకుండా రేపటి నుంచైనా బస్సులు తిప్పాలని కోరుతున్నారు.