దాసరి కుమారుడు ప్రభు కనిపించడంలేదు - MicTv.in - Telugu News
mictv telugu

దాసరి కుమారుడు ప్రభు కనిపించడంలేదు

June 13, 2019

Dasari Narayana Rao's son Prabhu does not appear.

దివంగత ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు తారక్ ప్రభు కనిపించడంలేదు. ఈ నెల 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన  తిరిగి ఇంటికి రాలేదు. ఈ ఘటనపై ప్రభు కుటుంబీకులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రభు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

2008లో కూడా ఆయన ఒకసారి ఇలాగే కనబకుండా పోయారు. కొన్ని రోజులకు ఆయన బయటకు వచ్చి భార్య సుశీలే తనను కిడ్నాప్‌ చేయించిందని ఆరోపించారు. ఆ తర్వాత దాసరి నారాయణరావు మృతిచెందడం.. ప్రభుకు భార్యతో ఆస్తి వివాదం తలెత్తిన విషయాలు తెలిసినవే. అప్పట్లో ఆయన భార్య  సుశీల ఆస్తిలో వాటా కోసం మీడియా ముందుకు వచ్చారు. 1995లో ప్రభు తనను ప్రేమ వివాహం చేసుకున్నాడని సుశీల చెప్పారు. దాసరి కుటుంబసభ్యులు తన భర్తతో విడాకులు తీసుకొమ్మని బలవంతం చేస్తున్నారని ఆరోపించారు.