Dasoju shravan and swamy goud joined trs from bjp
mictv telugu

గులాబీ గూటికి దాసోజు, స్వామిగౌడ్.. వీడియో

October 21, 2022

తెలంగాణ రాజకీయాల్లో వేడివేడి పరిణామాలు.. ప్రధాన పార్టీల్లో అసమ్మతి, అసంతృప్తి వంటి కారణాలతో రాజీనామాలు. చేరికలు గంటల వ్యవధిలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి కమలం అందుకున్న దాసోజ్ శ్రవణ్ కషాయం కండువా విప్పేసి శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ కూడా కమలానికి స్వస్తి పలికి తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు. బీజేపీలో తమకు ప్రాధాన్యం దక్కలేదని ఇద్దరూ పొద్దున పార్టీని వీడి సాయంత్రం అధికార పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు.

ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వారికి పార్టీలోకి రావాలని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ నాయకులు అనుచరులు సంబరాలు చేసుకున్నారు. త్వరలో మరింత మంది బీజేపీని, కాంగ్రెస్‌ను వీడి గులాబీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తుండంతో ఆయా పార్టీలు దిద్దుబాటు చర్యలకు దిగాయి. పార్టీలు మారడం మామూలేనని పైకి సరిపెట్టుకుంటున్నా కాంగ్రెస్ స్వయంకృతాపరాధం, సరిగా లేని బీజేపీ నాయకుల పనితీరు, అహంమే ఈ జంపింగులకు కారణమని భావిస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ బీజేపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లడం తెలిసిందే.