బ్రదర్ కేటీఆర్.. ఇట్లు మీ శ్రావణ్.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రదర్ కేటీఆర్.. ఇట్లు మీ శ్రావణ్..

August 23, 2017

తనపై టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ శ్రావణ్ విరుచుకుపడ్డారు. కేటీఆర్ కు చెందిన మీడియా తనపై సోషల్ మీడియోలో దాడి చేస్తోందని, దీని కోసం ప్రజాధనాన్ని వాడుతోందని ఆరోపించారు.

ఈమేరకు మంగళవారం కేటీఆర్ కు ‘బ్రదర్ కేటీఆర్.. ’ అంటూ లేఖాస్త్రం సంధించారు. టీఆర్ఎస్ నాయకత్వం వాస్తవాలకు మసిపూస్తూ, ప్రచారార్భాటంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని శ్రావణ్ రోపించారు. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను లేవెనెత్తున్నవారిపై అధికార పార్టీ పెయిడ్ మీడియాతో బురదజల్లుడు ప్రచారానికి దిగుతోందని ధ్వజమెత్తారు.

కేసీఆర్ తో కలసి తాను దిగిన ఫొటోను కేటీఆర్ సోషల్ మీడియో పోస్ట్ చేయడంపై శ్రావణ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పటి గ్నాపకాలను, టీడీపీతో అనుబంధాలను ఇలాగే పదిలపరచుకున్నారా? అని ప్రశ్నించారు. ‘ఓటుకు నోట్ స్కాంలో చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడన్న కేసీఆర్ తర్వాత బాబుతో కలసి అమరావతిలో చేపల పులుసు, రొయ్యల వేపుడు ఆరగించిన విషయాన్ని కూడా పదిలంగా భద్రపరుచుకున్నారా?’ అని లేఖలో ఎద్దేవా చేశారు. పలు అంశాలపై కేటీఆర్ తో చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.