Home > Featured > ఆర్టెమిస్‌-1 ప్ర‌యోగానికి డేట్ ఫిక్స్..నాసా చ‌రిత్ర‌లోనే

ఆర్టెమిస్‌-1 ప్ర‌యోగానికి డేట్ ఫిక్స్..నాసా చ‌రిత్ర‌లోనే

భార‌త్ చేప‌ట్టిన చంద్ర‌యాన్ త‌ర‌హాలో అమెరికా అంత‌రిక్ష కేంద్రం (నాసా) ఓ స‌రికొత్త ప్ర‌యోగానికి తెర తీసింది. చంద్రుడిపైకి వ్యోమ నౌక‌కు పంపేందుకు రెడీ అయ్యింది. ఈ ప్ర‌యోగానికి 'ఆర్టెమిస్' అనే పేరు పెట్టుకుంది. ఈ నెల 29వ తేదీన 'ఆర్టెమిస్‌-1' ప్ర‌యోగాన్ని చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, ఇంద‌న లీకేజీ కార‌ణంగా ఆ ప్ర‌యోగం వాయిదా ప‌డింది. దీంతో మళ్లీ ఆ ప్రయోగం నాసా చేస్తుందా లేక మానేస్తుందా అనే అనుమానాలు రేకెత్తాయి.

ఈ క్రమంలో చంద్రుడిపైకి వ్యోమ నౌకలను పంపేందుకు నాసా చేపట్టిన 'ఆర్టెమిస్-1' ప్రయోగాన్ని సెప్టెంబర్ 3వ తేదీన (శనివారం) చేపట్టనున్నామని కాపేపటిక్రితమే నాసా.. త‌న ప్ర‌యోగానికి కొత్త తేదీని ప్ర‌క‌టించింది. ఈ విషయాన్ని నాసానే స్వయంగా ప్రకటించింది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ప‌లు కీల‌క మైలు రాళ్ల‌ను అధిగ‌మించిన నాసా.. త‌న చ‌రిత్ర‌లోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దినుంది. ఈ ప్రయోగం గనుక విజ‌య‌వంత‌మైతే..నాసా చ‌రిత్ర‌లో మ‌రో అరుదైన రికార్డ్ న‌మోదు అవుతుందని పేర్కొంది.

నాసా.. ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత శక్తిమంతమైన రాకెట్ ఇదే కావడం విశేషం. శనివారం ప్రయోగానికి అనువైన వాతావరణం ఉండే అవకాశాలు 40 శాతం వరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో దాదాపు 322 అడుగుల పొడవున్న ఈ భారీ రాకెట్‌ను కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోనే ఉంచారు. అన్నీ సానుకూలంగా జరిగితే, శనివారం మధ్యాహ్నాం 2.17 నిమిషాలకు లభించే లాంఛ్ విండోలో ఈ రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఈసారి మానవరహిత ఓరియన్ స్పేస్ క్యాప్సులను రాకెట్‌తోపాటు అంతరిక్షంలోకి పంపనున్నారు.

Updated : 31 Aug 2022 6:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top