ప్రపంచటెస్ట్ చాంపియన్ షిప్(wtc-2023) ఫైనల్ మ్యాచ్ జరగబోయే తేదీ వచ్చేసింది. జూన్ 7న ఇంగ్లండలోని ఓవల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా ఐసీసీ ప్రకటించింది.ఫైనల్లో తలబడపోయే జట్లపై ఆసక్తి నెలకొంది. మొదటి, రెండు స్థానాల్లో ఆసీస్, ఇండియా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో తలబడపోతున్నాయి.
ఈ సిరీస్ ఫలితం తర్వాతనే ప్రపంచటెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తులపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. తుదిపోరులో నిలవాలంటే ఈ సిరీస్‌లో టీం ఇండియా తప్పక గెలవాల్సి ఉంది. ఏకపక్షంగా సిరీస్ గెలిస్తే నేరుగా ఫైనల్లో తలుపు తట్టేయొచ్చు. అలా ఐతే ఆస్ట్రేలియాకు కాస్త కష్టాలు మొదలవుతాయి. 136 పాయింట్లతో దాదాపు ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్న కంగారులు పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆ రెండు జట్లు శ్రీలంక, సౌతాఫ్రికా జట్లకు మిగిలి ఉన్న సిరీస్ ఫలితాల వరకు వేచి చూడక తప్పదు. మొదటి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌ను భారత్ చేజార్చుకుంది. పైనల్లో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించి ట్రోఫినీ దక్కించుకుంది.