దత్తాత్రేయను తప్పించింది ఇందుకేనా... - MicTv.in - Telugu News
mictv telugu

దత్తాత్రేయను తప్పించింది ఇందుకేనా…

September 1, 2017

కమలనాథులు పక్కా వ్యూహాంతోనే ముందుకెళ్తున్నట్లుంది. తెలుగు వారిని ప్రధాన రాజకీయాల నుండి తప్పిస్తున్నారు. లేదనుకుండా… కాదనకుండా కొత్త పదవులిస్తున్నారు. దీనిపై అంతటా చర్చ జరుగుతున్నది. దక్షిణాదిలో బిజెపి ఏం చేయబోతున్నదనేది పాయింట్. అయితే దక్షిణాది నుండి ప్రధానంగా తెలుగు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ లీడర్ వెంకయ్యను ఆయనను మంత్రి వర్గం నుండి తప్పించి ఉప రాష్ట్రపతిని చేశారు. దేశంలోనే ఉన్నత పదవి ఇచ్చారు. దానిపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు దత్తాత్రేయ ను కేంద్ర మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనికి ఆయనకూ ఏదో పదవి ఇస్తారనే చర్చ జరుగుతున్నది.

అయితే ఈ మార్పులు దేనికి సంకేతం అనేదే పాయింట్. పాత తరాన్ని గౌరవిస్తూనే కొత్త వారికి ప్రయార్టీ ఇద్దామని అనకుంటున్నట్లు పార్టీ నాయకులు చెప్తున్నారు. సుదీర్ఘ కాలంగా మన దగ్గర నుండి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబ్టటి కొత్త తరానికి ఛాన్స్ ఇద్దామనే థాట్ లో ఉన్నారట జాతీయ స్థాయి బిజెపి పెద్దలు. దానికి తోడు సంఘ్ నుండి కొత్త వారికే ఛాన్స్ ఇవ్వాలనే సంకేతాలూ బలంగా ఉన్నాయట.

తెలంగాణ, ఎపిల్లో బలపడాలని కూడా బిజెపి భావిస్తున్నది. అమిత్ షా   తెలంగాణ, ఎపిల్లో పర్యటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఘనంగా చేయాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికే నని అంటున్నారు. పార్టీలో మన దగ్గర నుండి రెండు దశబ్దాలుగా సీరియస్ గా వర్క్ చేస్తున్న వారున్నారు. వారికే తొల్త ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నట్లు టాక్.

దీంట్లో ఎపి నుండి హరిబాబు పేరు బలంగా విన్పిస్తున్నది మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, అట్లాగే తెలంగాణ నుండి కిషన్ రెడ్డి పేరు విన్పిస్తున్నది. దాంతోపాటు పార్టీ పదవుల్లో కూడా బిసి, ఎస్సీలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. పార్టీ పునాది నుండి మార్పులు చేసుకుంటూ వస్తే తప్ప ఇక్కడ నిలబడలేమని గుర్తించినట్లుంది. దాంతోపాటు ఉత్తరాదిలో పార్టీ మునుపటి ఎన్నికల్లంత పెఫార్మెన్స్ వచ్చే ఎన్నికల్లో చూపించే అవకాశం లేదని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, యూపిల్లో   ఇప్పటన్నీ సీట్లు రావని అంచనుకు వచ్చిన తర్వాతనే దక్షిణాదిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది.

అయితే ఇక్కడ బలమైన రెండు పార్టీలున్నాయి.ఎపిలో ఉన్న టిడిపి ఎన్డీకే తో అలయెన్స్ లో ఉన్నది. టిఆర్ఎస్ బయటి నుండి మిత్ర పక్షంగానే ఉంది. ఈ రెండింటీని బ్రేక్ చేయాలనేది ప్లాన్. అంత ఈజీ కాదు. కాబట్టి నాయకత్వంలో కింది స్థాయి నుండి మార్పు తీసుకుంటూ రావాలనేది ప్లాన్. తమిళనాడులో ఏఐడిఎంకే ను తన అదుపు అజ్జానల్లోకి పెట్టుకున్నది బిజెపి. అటూ తమిళ పాలిటిక్స్ పై గ్రిప్ సంపాదించే పనిలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో బపలడితే గనుక కర్నాటక ఎట్లాగూ తమదనే భావనలో ఉన్నారు. నార్త్ కంటే ఈసారికి సౌత్ బెటర్ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడునర్న పెద్దలను తప్పించి కొత్త వారికి అవకాశాలిస్తూ తమ పరిధిని పెంచుకునే పనిలో పడ్డారు కమల నాథులు. మంత్రి వర్గ విస్తరణలో ఎపి నుండి రామ్ మాధవ్, తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, తమిళనాడు ఏఐడిఎంకే నుండి తంబిదురై, కె. వేణుగోపాల్ వంటి వారికి అవకాశాలిచ్చే ఛాన్స్ ఉందని టాక్.