గవర్నర్ అయినా సెంటిమెంట్ మర్చిపోని దత్తాత్రేయ - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నర్ అయినా సెంటిమెంట్ మర్చిపోని దత్తాత్రేయ

October 9, 2019

Dattatreya .

దసరా పండగ ముగిసిందంటే అందరికి గుర్తుకు వచ్చేది అలాయ్ – బలాయ్.. కార్యక్రమం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మెళనంలో రాజకీయ నాయకులతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరు అవుతుంటారు. గత 15 సంవత్సరాలుగా దత్తన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రకరకల రుచికరమైన తెలంగాణ వంటకాలతో వింధు ఇస్తుంటారు. ఈసారి ఆయన హిమాచల్ గర్నర్‌గా ఉన్నా కూడా తన సెంటి మెంట్ ఏ మాత్రం మర్చిపోలేదు.

ఎప్పటిలాగే ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న నక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ప్రతీ ఏటా దత్తాత్రేయ ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఈసారి మాత్రం ఆయన కుమార్తె విజయలక్ష్మి బాధ్యత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, సహా ముఖ్య నేతలు హాజరుకాన్నారు. మొత్తానికి గవర్నర్‌గా బిజీగా ఉన్నా కూడా దత్తన్న తన సెంటి మెంట్‌ను పక్కనపెట్టకుండా ఆత్మీయ సమ్మెళనం నిర్వహిస్తున్నారు.