Daughter Rohini to donate kidney to Lalu,
mictv telugu

లాలూకు..కుమార్తె కిడ్నీ దానం

November 10, 2022

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనస్సు చాటుకుంది. ఆనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఒక కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంల లాలూ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. జైలు నుంచి తిరిగొచ్చాక ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల సింగపూర్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచించారు. దీంతో తన తండ్రికి ఒక కిడ్నీ ఇస్తానని కుమార్తె రోహిణి వైద్యులకు తెలిపింది. మొదట అందుకు లాలు ఒప్పుకోకపోయిన తర్వాత ఓకే చెప్పేసారు. ఈ నెల 20-24 మధ్య లాలూ మరోసారి సింగపూర్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలో అక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయనున్నట్టు సమాచారం. లాలూ గత కొన్నేళ్లుగా ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య సేవలు పొందుతున్నారు. కానీ, మూత్రపిండాల మార్పిడి చికిత్సను ఎయిమ్స్ వైద్యులు సూచించలేదు. సింగపూర్ వైద్యులు ఈ సూచన చేయడంతో, అక్కడే చేయించుకునేందుకు మొగ్గు చూపిస్తున్నట్టు తెలిసింది.లాలూ కుమార్తె రోహిణి ప్రస్తుతం సింగపూర్‌ లోనే ఉన్నారు.