David Warner apologized to Rashmika Mandanna for viral video
mictv telugu

రష్మికాను వార్నర్ అలా చేసి.. సారీ చెప్పేశాడు

November 17, 2022

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌‌లో హైదరాబాద్ తరఫున ఆడాక సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాడు. తెలుగు సినిమాల డైలాగ్స్, పాటలతో వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు. అప్పటి బాహుబలి నుంచి మొన్నటి పుష్ప వరకు గెటప్‌లు వేస్తూ తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఈ మధ్య డీజే టిల్లుగా మారి పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంది. తాజాగా భీష్మ మూవీలోని రష్మిక మందానా పాటలోని డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను వార్నర్ షేర్ చేశాడు.

రష్మిక ఫేస్ స్థానంలో తన ఫేస్ ఉన్న డ్యాన్సింగ్ వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని రష్మిక డాన్స్ చేసిన స్టెప్పులను తాను చేసినట్లుగా క్రియేట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ వీడియోపై మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన సందర్భంగా రష్మికకు వార్నర్ సారీ చెప్పాడు. సో సారీ అంటూ ఒక కామెంట్ కూడా రాసుకొచ్చాడు. చేసిందల్లా చేసి చివరికి సారీ చెప్తావా వార్నర్ అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.