జూ.ఎన్టీఆర్‌ కోసం ‘పక్కా లోకల్’ గా మారిన వార్నర్  - Telugu News - Mic tv
mictv telugu

జూ.ఎన్టీఆర్‌ కోసం ‘పక్కా లోకల్’ గా మారిన వార్నర్ 

May 20, 2020

mfn

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు టిక్‌ స్టార్‌గా మారిపోయాడు. తన ఫ్యామిలీతో కలిసి రోజుకో వీడియో పోస్ట్ చేస్తూ హల్ చల్ చేస్తున్నాడు. వీటిలో మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమా పాటలకు స్టెప్పులు వేయడం, డైలాగులు చెప్పడం ఆయా హీరోల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఊహించని విధంగా బర్త్ డే విషెష్ చెప్పాడు. ఎన్టీఆర్ సినిమా పాటకు స్టెప్పులు వేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ దాన్ని షేర్ చేసుకుంటున్నారు. 

జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌లు కలిసి డ్యాన్స్ చేసిన పక్కా లోకల్ అనే పాటకు మాస్ స్టెప్స్ వేశారు. తన భార్యతో కలిసి ఈ డ్యాన్స్ చేసి ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చేశాడు. దీన్ని పోస్ట్ చేస్తూ..హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. క్రికెట్ స్టేడియంలో పరుగుల వరద పారించే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇలా టిక్ టాక్ బాటను ఎంచుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పాటలు,డైలాగులతో అందరిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.