ఈసారి బాహుబలి గెటప్.. వార్నర్‌కు ఆర్ఆర్ఆర్‌లో చాన్స్ ఇస్తే పోలా - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి బాహుబలి గెటప్.. వార్నర్‌కు ఆర్ఆర్ఆర్‌లో చాన్స్ ఇస్తే పోలా

May 16, 2020

Australia

రోజుకొక టిక్‌టాక్ వీడియోతో ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్ అదరగొడుతున్నాడు. ఎలాగూ ఆటల్లేవు కాబట్టి ఇలా పాటలతోనైనా తన అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలని భావించినట్టున్నాడు. బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు స్టెప్పులేసి ఇరగదీసిన విషయం తెలిసిందే. పోకిరీ సినిమాలోని ‘ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను’ అనే మహేశ్ డైలాగ్ చెప్పి తెలుగువారికి దగ్గరవుతున్నాడు. తాజాగా మరో తెలుగు సినిమా డైలాగ్‌‌తో వార్నర్ చించేశాడు. 

బాహుబలి చిత్రంలో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చెప్పిన ‘అమరేంద్ర బాహుబలి అనే నేను’ అనే డైలాగ్‌ను టిక్‌టాక్‌ చేశాడు. ఈ వీడియోలో తన కుమారుడిని కూడా వాడుకున్నాడు. డైలాగ్‌కు తగ్గట్టుగా బాహుబలి గెటప్ కూడా వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వార్నర్‌కు తెలుగు గాలి బాగా సోకినట్టుంది అని అంటున్నారు. ఈ దెబ్బతో దర్శకుడు రాజమౌళి, వార్నర్‌కు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అవకాశం ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు.