మహేశ్‌కు వార్నర్ మైండ్ బ్లాక్ బర్త్‌డే శుభాకాంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

మహేశ్‌కు వార్నర్ మైండ్ బ్లాక్ బర్త్‌డే శుభాకాంక్షలు

August 9, 2020

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ కూడా మహేష్‌కి తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్’ అనే పాటకి తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే లెజెండ్ మహేష్ అంటూ వార్నర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో తాను టిక్‌టాక్‌లో చేసిన వీడియోనే అటాచ్ చేశారు. మరోవైపు మహేశ్‌కు అభిమానుల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 

 

View this post on Instagram

 

Happy birthday @urstrulymahesh legend #mindblock #dance

A post shared by David Warner (@davidwarner31) on

కాగా, కరోనాతో క్రికెట్‌కి దూరంగా ఉంటున్న డేవిడ్ వార్నర్ ఇంట్లో ఉంటూ టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ చిత్ర పరిశ్రమకి చెందిన సినిమాలలోని సూపర్ హిట్ పాటలకు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ ఇక్కడివారిని అలరిస్తున్నారు. ఇటు సరదాగా వీడియోలు చేస్తూనే మరోవైపు ఐపీఎల్ టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నారు.

David Warner Mind Black Birthday Wishes To Mahesh babu