మెల్బోర్న్ వేదికంగా దక్షిణాఫ్రితో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. 100 వ టెస్ట్‌లో వార్నర్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. సఫారీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన ద్వితకాన్ని అందుకున్నాడు. 254 బంతుల్లో డబుల్ సెంచెరీ (200) సాధించి రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. వార్నర్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 145 బంతుల్లో మొదటి సెంచరీ సాధించిన వార్నర్..తర్వాత వంద పరుగులను 109 బంతుల్లో చేశాడు. డబుల్ సెంచరీకి ముందు క్రీజులో నిల్చేందుకు వార్నర్ విపరీతంగా ఇబ్బంది పట్టాడు. విపరీతమైన వేడి, అలసటతో బాధపడ్డాడు. చివరికి డబుల్ సెంచరీ సాధించిన వెంటనే రిటైర్డ్ హట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 84 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. వార్నర్ తో పాటు స్టీవెన్ స్మిత్ (85) రాణించాడు. ప్రస్తుతం క్రీజ్‌లో హెడ్(34), గ్రీన్(6) ఉన్నారు.
వార్నర్ రికార్డుల మోత
బాక్సిండే టెస్ట్‌లో వార్నర్ సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. 100వ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ ఆటగాడిగా, ప్రపంచంలో రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ఈ ఘనతను అందుకున్నాడు. అదే విధంగా 100వ టెస్టులో ట్రిపుల్ ఫిగర్లు సాధించిన రెండో ఆసీస్ బ్యాటర్‌గా నిలిచి..రికీ పాంటింగ్ సరసన చేరాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా తన 100వ టెస్ట్ లో శతకం సాధించాడు. దీంతో పాటు కెరీర్లో 8,000 పరుగుల మైలురాయిని వార్నర్ అందుకున్నాడు. తద్వారా, ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆసీస్ బ్యాటర్‌గా నిలిచాడు.
100వ టెస్ట్‌లో సెంచరీ సాధించిన బ్యాటర్లు
100వ టెస్టులో శతకం నమోదు చేసిన 10వ బ్యాటర్ వార్నర్. ఈ పీట్లో కోలిన్ కౌడ్రీ (104), జావేద్ మియాందాద్ (145), గోర్డాన్ గ్రీనిడ్జ్ (145), అలెక్ స్టీవర్ట్ (105), ఇంజమామ్-ఉల్-హక్ (184), పాంటింగ్ (143*), గ్రేమ్ స్మిత్ (131), ఆమ్లా (134), జో రూట్ (218) ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
నేడు మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి!
క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్.. బండి సంజయ్‌కి ఘోర పరాభవం