ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌పై క్లారిటీ వచ్చేసింది. రోడ్డు ప్రమాదానికి గురై జట్టుకు దూరమైన కెప్టెన్ రిషబ్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ను సారథిగా నియమించేందుకు రంగం సిద్ధమవుతోంది. వార్నర్‌కి కెప్టెన్సీ అనుభవం ఉండటంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ..అతనికే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ ప్రస్థానం ఢిల్లీ జట్టుతోనే మొదలైంది. 2009లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్. తర్వాత హైదరాబాద్‌కు మారాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా సుధీర్ఘంగా సేవలు అందించిన డేవిడ్ వార్నర్.. 2016లో ఆ జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు. కానీ 2021లో పేలవ ఫామ్ చూపించడంతో అతన్ని సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించారు.తర్వాత జట్టునుంచి విడుదల చేశారు. అనంతరం ఢిల్లీతో వార్నర్ చేరాడు. గత ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున 12 మ్యాచుల్లో 432 పరుగులు చేశాడు. దీనిలో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.