దావూద్ ఇబ్రహీంకు, అతని భార్యకు కరోనా! - MicTv.in - Telugu News
mictv telugu

దావూద్ ఇబ్రహీంకు, అతని భార్యకు కరోనా!

June 5, 2020

Dawood Ibrahim.

పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా అంటుకుందని, అతని భార్య మహజబీన్ కూడా దాని బారిన పండిందని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దెబ్బకు దావూద్, అతని నరహంతక ముఠా క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్ ప్రస్తుతం కరాచీలో పా మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని టీవీలు చెబుతున్నాయి. 

అతడు కరాచీలోనే ఉన్నాడని భారత్ పక్కాగా చెబుతున్నా ఇమ్రాన్ ఖాన్ మాత్రం అతనికి అండదండగా నిలుస్తూ ఈగ వాలకుండా చూసుకుంటున్నాడు. పాకిస్తాన్‌లో లాక్ డౌన్ లేకపోవడంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. 80 వేలకు చేరువయ్యాయి. అసలే వైద్యసదుపాయాలు అంతంత మాత్రంగా ఉండే పాక్ లో కరోనా పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా మసీదులు బార్లా తెరిచేశారు. 1993 నాటి బాంబు పేలుళ్లతోపాటు పలు హత్యలు, స్మగ్లింగ్ నానా ఘోరాల కేసులో నిందితుడైన దావూద్‌కు పాక్ ఐఎస్ఐ రక్షణ కల్పిస్తోంది.