బస్సుల్లో, రైళ్లలో టికెట్ లేకుండా జర్నీ చేసేవారిని చాలా మందినే చూసుంటాము. కానీ ఓ గ్రామంలో మాత్రం వింత దృష్యం చోటు చేసుకుంటోంది. ప్రతి రోజూ రైల్వేస్టేషన్లో టికెట్ కొంటారు కానీ రైలు ఎక్కరట. ఇదెక్కడి చోద్యం అని అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్జ్ సమీపంలోని దయాల్పూర్ రైల్వే స్టేషన్లో ప్రతి రోజూ అక్కడి ప్రజలు రైలు టికెట్టు కొనుగోలు చేస్తారు. కానీ ఎవరూ రైలులో ప్రయాణించరు. ఎందుకంటే దీనికి ఓ బలమైన కారణం ఉంది.
1954లో దయాల్పూర్ రైల్వేస్టేషన్‌ను నిర్మించారు. స్టేషన్ ఏర్పైటైన తరువాత కొన్నేళ్లు అంతా బాగున్నా, ఆ తరువాత ప్రయాణికుల తాకిడి లేక రైల్వేకు ఆదాయం తగ్గింది. దీంతో 2006లో రైలు సేవలను నిలిపేశారు. ఈ క్రమంలో రైలు సేవలను పునరుద్ధరించాలని అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున దర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారి పోరాటం ఫలితంగా 2022లో మళ్లీ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులు టిక్కెట్లు బాగానే అమ్ముడుపోయాయి. కానీ మళ్లీ అమ్మకాలు లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రజలు స్టేషన్ మళ్లీ మూతపడుకుండా ఉండేందుకు ఓ కొత్త ప్లాన్ ను వర్కౌట్ చేశారు. రైలు ప్రయాణం చేయకపోయినా గ్రామస్థులే రైలు టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. గ్రామస్థుల ముందు చూపుతో 2022 డిసెంబరు వరకు నెలలో 700 టకెట్లు అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది స్టేషన్ ఆదాయం తగ్గడంతో మళ్లీ భారీగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా స్టేషన్ ఆదాయం తగ్గినప్పుడల్లా టికెట్లను కొంటూ తమ గ్రామానికి రైలు సేవలు ఆగకుండా గ్రామస్థులు జాగ్రత్తపడుతున్నారు.