చిన్న పిల్లల కరోనా టీకాకు అనుమతులిచ్చిన డీసీజీఐ - MicTv.in - Telugu News
mictv telugu

చిన్న పిల్లల కరోనా టీకాకు అనుమతులిచ్చిన డీసీజీఐ

April 26, 2022

దేశంలో 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్న పిల్లలకు కోవాగ్జిన్ టీకా ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. దీంతోపాటు 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ‘బయోలాజికల్ ఇ’ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్ టీకాకు అనుమతులిచ్చింది. ఈ మేరకు మంగళవారం అత్యవసర అనుమతులు జారీ చేశారు. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. వ్యాక్సిన్ పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతీ 15 రోజులకొకసారి సెక్యూరిటీ డేటాను ఇవ్వాలని ఆదేశించింది. తర్వాత 5 నెలల పాటు నెలకొకసారి ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉండగా, అనుమతులు వచ్చిన నేపథ్యంలో త్వరలోనే చిన్న పిల్లలకు వ్యాక్సిన్ వేసేలా కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.