అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా 20కంపెనీలకు కేంద్రం భారీ షాకిచ్చంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి లేని మందులను ఆన్‌లైన్‌లో విక్రయించినందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్‌తో సహా 20 మంది ఆన్‌లైన్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2018, డిసెంబర్ 12 నాటి హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ డిసిజిఐ వీజీ సామాని ఫిబ్రవరి 8న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం అనుమతి లేని మందులను ఆన్‌లైన్‌లో విక్రయించడం నిషేధమని కోర్టు పేర్కొంది.
డిసిజిఐ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు, యూనిన్ టెరిటరీలకు నోటీసులు జారీ చేసింది. మే, నవంబర్ 2019, ఫిబ్రవరి 3 తేదీలలోకూడా నోటిసీసులు పంపించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత రెండు రోజుల్లోగా కంపెనీలు స్పందించాల్సి ఉందని తెలిపింది. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని కోరింది. ఎలాంటి అనుమతులు లేకుండా మెడిసిన్స్ విక్రయం, స్టాకింగ్, డిస్ట్రిబ్యూన్ వంటివి ఎందుకు చేస్తున్నారో వివరణ ఇవ్వాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది.
డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం.. మెడిసిన్స్ సేల్, స్టాక్, డిస్‌ప్లే, ఆఫర్ ఫర్ సేల్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటికి కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. సంబంధిత రాష్ట్రానికి చెందిన లైసెన్సింగ్ అథారిటీ నుంచి ఈ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. లైసెన్స్‌లోని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా సంస్థల నుంచి ఎలాంటి స్పందన రానట్లయితే.. కంపెనీ నుంచి చెప్పదలుచుకున్నది ఏమీ లేదని డీసీజీఐ భావిస్తుంది. అప్పుడు ఎలాంటి నోటీసులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని డీసీజీఐ వెల్లడించింది.