మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌కు అరుదైన గౌరవం - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌కు అరుదైన గౌరవం

November 21, 2019

Gautam Gambhir.

భారత జట్టు మాజీ ఓపెనర్‌, ప్రస్తుత తూర్పు ఢిల్లీ లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఓ స్టాండ్‌కు ఆయన పేరు పెట్టనున్నారు. ఇప్పటికే ఈ స్టేడియంలోని ఓ స్టాండ్‌కి ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు పెట్టారు. విరాట్ కోహ్లీ గౌరవార్థం ఈ ఏడాది సెప్టెంబరులో దీనికి సంబంధించిన వేడుక కూడా నిర్వహించారు. 

తాజాగా గంభీర్‌కు కూడా అటువంటి గౌరవమే దక్కనుంది. దీనిపై ఢిల్లీ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) జాయింట్ కార్యదర్శి రాజన్‌ మంచండా మాట్లాడుతూ..’భారత క్రికెట్ జట్టుకు గంభీర్‌ చేసిన సేవలకు ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నాం. ఇందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ స్టాండ్‌కి గంభీర్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అది కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే రంజీట్రోఫీ సీజన్‌ నుంచే ఈ స్టాండ్‌ అందుబాటులోకి రానుంది’ అని తెలిపారు. డీడీసీఏ నిర్ణయం పట్ల గంభీర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.