రకుల్ పెళ్లి డాన్స్.. చూసి తీరాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్ పెళ్లి డాన్స్.. చూసి తీరాల్సిందే..

April 12, 2019

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ ప్రియురాలిగా రకుల్, ఆయన మాజీ భార్యగా టబు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమాలోని ‘వడ్డీ షరాబన్’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో రకుల్ తన అంద చందాలతో ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఓ పెళ్లిలో ఆమె స్టెప్పులేస్తూ కనిపించారు. ఈ పాట విడుదలై కొన్ని గంటలై అయినా.. ఇప్పటి వరకు 10,886,806 మంది వీక్షించారు. విసిన్ పట్వా సంగీతం అందించిన ఈ పాటను సునిధీ చౌహాన్, నవ్‌రాజ్ హన్స్ పాడారు.

ఈ పాటకు గురించి రకుల్ స్పందిస్తూ.. ‘వడ్డీ షరాబన్‌..’ షూటింగ్‌ ఎంతో సరదాగా జరిగింది.. ఇది నాకు ఓ గొప్ప అనుభవం. ఇంత చక్కటి పాటను నాకిచ్చిన వారందరికీ థ్యాంక్స్’ ట్వీట్‌ చేశారు. అకీవ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మించింది. వచ్చే నెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది.