శవాలు కదులుతాయి.. సైన్స్ నిరూపించింది - MicTv.in - Telugu News
mictv telugu

శవాలు కదులుతాయి.. సైన్స్ నిరూపించింది

November 25, 2020

ss

శవాన్ని చూడాలంటే మనకు బాధగా, భయంగా ఉంటుంది. మనిషి చనిపోయాక సాయంత్రం లోపు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. మరి శవాలకు అంత్యక్రియలు జరిపాక ఏం జరుగుతుంది? దహనం గురించి కాదు, ఖననం గురించి అన్నమాట. హిందువుల్లో కొన్ని కులాలు, క్రైస్తవులు, ముస్లింలు శవాలను కాల్చకుండా పూడ్చిపెడుతుంటారు. మరి వాటిని పూడ్చాక ఏం జరుగుతుంది? ఇదేం ప్రశ్న అని ఆశ్చర్యపోకుండి. మృతదేహాలను పూడ్చాక చాలా విషయం ఉంటుంది. శవాలు కదులుతాయి! 

నమ్మలేకపోతున్నారా?  కానీ,  నమ్మతీరాల్సిందే అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మహిళా శాస్త్రవేత్త. మనిషి చనిపోయాక కళేబరం ఏడాదిపాటు కదులుతుందని ఆమె బల్లగుద్ది వాదిస్తున్నారు. ఒక శవాన్ని 17 నెలల పాటు ఫొటోలు తీసి, ఫలితాలు విశ్లేషించానని అంటున్నారు. ఆమె పేరు ఎలిసన్ విల్సన్. సీక్యూ యూనివర్సిటీలో ఆమె క్రిమినాలజీలో పట్టా పుచ్చుకున్నారు. 

సిడ్నీ శివారులోని శ్మశాన వాటికలో విల్సన్ ఓ శవంపై ఈ అధ్యయనం చేశారు. శవాలు పూడ్చిపెట్టాక రసాయనిక చర్యల వల్ల కొంతమేరకు కదులుతాయని తన పరిశోధనలో తేలినట్లు విల్సన్ తెలిపింది. ‘మేం ఎంచుకున్న శవాన్ని ప్రతి అర గంటకు ఒకసారి ఫోటో తీశాం 17 నెలలపాటు తీసిన ఫొటోలను విశ్లేషించాక శవం కదిలినట్లు తేలింది. చేతుల్లోని కండరాలు, ద్రవాలు క్షీణించడం వల్ల శవం భంగిమలో తేడాలు వస్తాయి.. పీనుగలు వాటి ఉంచిన స్థలంలో ఉండవు. కుళ్లిపోవడడం, లిగమెంట్ ద్రవాలు ఎండిపోవడం వల్ల కాస్త పక్కకు జరుగుతాయి…’ అని చెప్పారు. విల్సన్ అధ్యయన ఫలితాలను ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్.. సినర్జీ పత్రికలో అచ్చేశారు.