వడ సాంబార్‌లో బల్లి.. హోటల్ బంద్.. - MicTv.in - Telugu News
mictv telugu

వడ సాంబార్‌లో బల్లి.. హోటల్ బంద్..

May 16, 2019

ఓ టిఫిన్ సెంటర్‌లో వడ, సాంబార్‌లో బల్లి వచ్చింది. అది తిని ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో సదరు హల్దీరామ్‌కు చెందిన హోటల్ మూసివేశారు. ఈ ఘటన నాగాపూర్‌లోని అంజని స్క్వేర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు హల్దీరామ్ ఔట్ లెట్‌కు వచ్చి వడ, సాంబార్ ఆర్డర్ చేశారు. సర్వర్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తింటున్నారు. ఇంతలో ఇద్దరూ షాకయ్యారు. చెంచాతో సాంబార్‌లో కెలకగా అందులో ఓ బల్లి కనిపించింది. దీంతో వారిద్దరు దాన్ని ఫోటోలు తీసి నేరుగా ఆహార, డ్రగ్ కంట్రోల్ అధికారులకు(FDA) ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Dead lizard found in food at Haldiram's restaurant in Nagpur FDA shuts down outlet

ఈ ఘటన గురించి ఎఫ్‌డీఏ అసిస్టెంట్‌ కమిషనర్‌ మిలింద్‌ దేశ్‌పాండే పీటీఐ వార్తా సంస్థకు వివరిస్తూ… ‘ఇద్దరు వ్యక్తులు హల్దీరామ్స్‌ అవుట్‌లెట్‌కు వచ్చి వడ, సాంబార్‌ ఆర్డర్‌ ఇచ్చారు. అవి తింటుండగా సాంబార్‌లో చచ్చిన బల్లి కనిపించింది. వెంటనే వాళ్ళు ఈ విషయాన్ని అవుట్‌లెట్‌ సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. అతను ఆ ఆహారాన్ని పడేశారు. తర్వాత బాధితులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి, 24 గంటలపాటు పర్యవేక్షణలో ఉంచాం. వారికి ఏం కాలేదు’ అని చెప్పారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు ఔషధ నియంత్రణ అధికారుల అవుట్‌లెట్‌ వంట గదిని తనిఖీ చేశారు. అక్కడ చాలా లోపాలు కనిపించినట్లు తెలిపారు. ఈ కిచెన్‌ను ఆహార భద్రత ప్రమాణాల నిబంధల ప్రకారం మార్పులు చేయాలని సూచించారు. అప్పుడే అవుట్‌లెట్‌ను తిరిగి తెరిచేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టంచేశారు.