ప్రయాణికులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు..? - MicTv.in - Telugu News
mictv telugu

ప్రయాణికులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకు..?

July 26, 2017

రైళ్లలో ప్రయాణికులకు సరఫరా జేసే తిండి సక్కదనాన్ని గురించి…ఇంతకు ముందే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బయట పెట్టిన నిజాలు తెల్సిందే,ఆ తిండి మనుషులు తినెదానికి  పనికిరాదని వారం రోజులముందే  కాగ్‌  భారతీయ రైల్వేపై మండిపడింది.తాజాగా ఝార్ఖండ్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్న పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు ఆర్డర్ చేసిన బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించింది.ఒక్కసారిగా షాకైన ప్రయాణికుడు దీనిపై  రైల్వే సిబ్బందికి, క్యాటరింగ్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు.

దీంతో వారు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుకు ఘటనపై ట్వీట్‌ చేశారు. దీనిపై వెంటనే మంత్రి స్పందించారు. రైలు యూపీలోని మొఘల్‌సరాయి స్టేషన్‌లో ఆగగానే పలువురు రైల్వే అధికారులు వైద్యసిబ్బందిని వెంట బెట్టుకొని బాధితుల వద్దకు చేరుకున్నారు. వారికి చికిత్స అందించారు.ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సీనియర్‌ రైల్వే అధికారి కిశోర్‌కుమార్‌ వెల్లడించారు.ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న  రైల్వే సిబ్బందికి ఇంత నిర్లక్షమెందుకు, విషయం రైల్వే మంత్రిదాక పోతేగాని స్పందించని ఆఫీర్లున్నందుకు రైల్వేశాఖను  మెచ్చుకోవాల్సిందే,ఆహార నాణ్యతను చూడాల్సిన ఆఫీసర్లు  ఏం చేస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి,రైళ్లలో దూర ప్రయాణాలు చేసెటోళ్లు మీ జాగ్రత్తల మీరుంటె మంచిది.ఎంబట బట్టలు వస్తువులు ఏం మర్శిపోయినా సరేగనీ  తిననీకి ఖచ్చితంగా ఏదన్న ఎంబట కొంటవోతె మంచిది.