Dead person return alive Maharashtra home guard issue
mictv telugu

శవం లేచి కూర్చుంది.. జనం భయంతో పరార్..

October 27, 2022

ప్రాణం పోయిందో లేదో తేల్చుకోవడం సామాన్యులకు కష్టమైన విషయమే. ఊపిరాడనంత మాత్రన చనిపోయినట్లు కాదు. ఏవో సమస్యలతో గాఢంగా నిద్రపోతూ ఉండొచ్చు. మందో గిందో కొట్టి మొద్దుబారిపోయి ఉండొచ్చు. అందుకే అంత్యక్రియులు చేసేముందు పక్కాగా నిర్ధారించుకుంటారు. చివరికి శ్మశానంలోకి అడుగుపెట్టేముందు కూడా మరింత నిర్ధారించుకోడానికి శవం చెవిలో ‘నారాయణ నారాయణ’ అని పలుకుతారు. కానీ ఇప్పుడు వైద్యం, టెక్నాలజీ బాగా పెరిగాయి కాబట్టి వైద్యులు ఒక వ్యక్తి బతికాడో చనిపోయాడో పక్కగా చెప్పగలరు. ఆ యువకుడికి వైద్యం చేసిన వైద్యోనారాయణోహరులు కూడా అలాగే చెప్పేశారు. ‘చనిపోయాడు.. ఇక చేయాల్సిన ఏర్పాట్లేవో చూసుకోండి,’ అని అన్నారు. అతని బంధుమిత్రులు లబోదిబోమంటూ ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.

పాడెకట్టి శ్మశానానికి బయల్దేరారు. మరికొద్ది నిమిషాల్లో అంత్యక్రియల పూర్తి కావాలి. శవాన్ని వల్లకాటికి దగ్గర్లోని ఒ దేవత గుడి దగ్గర పెట్టారు. ఇంతలో శవం నిద్రపోయి లేచినట్లు లేచి కూర్చుంది. ఏర్పాట్లలో ఉన్న జనానికి గుండెలు జారిపోయాడు. జడుసుకుని కాలికి బుద్ధి చెప్పారు. కథలా ఉన్న ఉదంతం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగింది. పాటూర్ తాలూకా వివ్రా గ్రామానికి చెందిన ప్రశాంత్ మేష్రే అనే హోంగార్డు అనారోగ్యంతో బుధవారం చనిపోయాడు. వయసు పాతికేళ్లే. బంధుమిత్రులు గుండెలు బాదుకుంటూ పాడెకట్టారు. గుడి దగ్గర అతడు లేచికూర్చోవడంతో చెల్లాచెదరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనానికి ధైర్యం చెప్పారు. మనోడు దేవతల మహిమతో పునర్జన్మ ఎత్తాడని జనం ఊపిరిపీల్చుకుని పండగ చేసుకుంటున్నారు.