బంగారం తీసుకుందామని వెళ్లగా.. బతికిన శవం - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం తీసుకుందామని వెళ్లగా.. బతికిన శవం

May 18, 2019

మహిళ చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని తీసుకెళ్లి మార్చురీలోని రిఫ్రిజరేటర్‌లో పెట్టారు. కొన్ని గంటల తర్వాత చనిపోయిన ఆ మహిళ మళ్లీ లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. కలకలం రేపుతున్న ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్తలో చోటు చేసుకుంది.

65 మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయందని పేర్కొనడంతో సిబ్బంది వెంటనే శవాన్ని తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఆమె మెడలో గోల్డ్ చైన్ ఉందని, దాన్ని తీసుకోవాలని సిబ్బందిని అడగడంతో వారంతా కలిసి మృతదేహం వద్దకు వెళ్లారు. ఆమెను ఉంచిన రిఫ్రిజరేటర్ తెరిచి చూడగా ఆమె ఊపిరి పీల్చుకుంటుంది. షాక్ కి గురైన వారంతా వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారు. పరుగెత్తుకెళ్లిన డాక్టర్లు ఆమెకు నీళ్లు తాగించారు.

వెంటనే ఆమె కళ్లకు కట్టిన గంతలు తీసి, ముఖం మీద నీళ్లు చల్లడంతో ఆమె కళ్లు తెరిచింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన కొద్దిసేపటికే ఆమె మళ్లీ అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే కుపర్థలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ… ‘ బంగారమే ఆమెను కాపాడింది. దాన్ని తీసుకునేందుకు మార్చురీకి వెళ్లి ఉండకపోతే ఆమె అందులోనే చనిపోయేది’ అని బంధువులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొంటున్నారు.