పోలీసుల హెచ్చరిక.. ముగియనున్న గడువు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసుల హెచ్చరిక.. ముగియనున్న గడువు

March 30, 2022

mnbgf

పెండింగులో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు రేపటితో ముగిసిపోతుంది. దీంతో ఇంకా చలాన్లు కట్టని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గడువు దాటితే పొడగింపు ఉండదని హెచ్చరిస్తున్నారు. కాగా, గడువు ఇంకా రెండురోజులే ఉండడంతో కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. చలాన్లు క్లియర్ చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఇంత మంచి అవకాశమిచ్చినా ఇంకా కొందరు చలాన్లు కట్టడానికి ముందుకు రావడం లేదు. చిలకలగూడ ప్రాంతంలో పోలీసుల తనిఖీలో ఓ వాహనదారుడు పట్టుబడ్డాడు. అతని ద్విచక్ర వాహనంపై 97 చలాన్లు ఉండగా.. కట్టాల్సిన మొత్తం రూ. 47 వేలకు పైగా ఉన్నాయి. వెంటనే పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ రాయితీతో కేవలం రూ. 12 వేలు కడితే సరిపోతుందనీ, చలాన్లు కట్టి, బండి తీసుకువెళ్లాల్సిందిగా అతనికి సూచించారు.