Moscow Hotel Fire: ఘోరఅగ్నిప్రమాదం...ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు సజీవదహనం..!! - MicTv.in - Telugu News
mictv telugu

Moscow Hotel Fire: ఘోరఅగ్నిప్రమాదం…ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు సజీవదహనం..!!

February 22, 2023

రష్యా రాజధాని మాస్కోలో ఘోరఅగ్నిప్రమాదం జరిగింది. ఓ బహుళ అంతస్తుల హోటల్లో మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. హొటల్లో ఉన్న 200మందిని వెంటనే ఖాళీ చేయించారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

అగ్నిప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగిఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. భవనంలోని ఐదో అంతస్థులో మంటలు చెలరేగాయని తెలిపారు. మాస్కోలోని టాగన్‌స్కీ జిల్లాలో ఉన్న 41 ఏళ్ల నాటి భవనంలో కింది అంతస్తుల్లో హోటల్‌తోపాటు మంటలు చెలరేగిన పై అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు ఉన్నాయని రష్యా ఏజెన్సీలు తెలిపాయి.