how to deal with annoying husbands
mictv telugu

అజమాయిషీ భరించడం కష్టంగా ఉందా?

January 6, 2023

అన్ని బంధాల్లో కన్నా భార్యభర్తల బంధం చాలా స్పెషల్. ఇందులో ఇద్దరూ సమానమే. కానీ చాలామందిలో అలా జరగదు. పురుషాధిక్య సమాజంలో మగాడిది పై చేయి అవడం వలన భార్యభర్తల సంబంధంలో కూడా భర్తదే ఆధిక్యం అవుతోంది. అయితే కొంతమంది మితిమీరి అజమాయిషీ చెలాయిస్తుంటారు. మంచిగా ఉన్నట్టే ఉంటారు కానీ ఆధిక్యం ప్రదర్శించాలని చూస్తుంటారు. అలాంటి వాళ్ళని సైలంట్ గా భరించొద్దు అంటున్నారు మానసిన నిపుణులు. గొడవకు దిగకుండా సమస్యను సాల్వ్ చేసుకోవాలి అని చెబుతున్నారు. అదే సమయంలో ఆత్మ గౌరవాన్ని మాత్రం కోల్పోవద్దని సూచిస్తున్నారు.

కూర్చోబెట్టి మాట్లాడండి:

ఏ గొడవ అయినా కూర్చుని మాట్లాడితే తీరుతుందంటారు. ఇది పెత్తనం చెలాయించే భర్త విషయంలోనూ పనిచేస్తుందిట. అయితే థంబ్ రూల్ ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు ఏమీ చెప్పకూడదు. కోపంగా ఉ్నప్పుడు ఏమీ చెప్పకపోవడమే మంచిది. అప్పుడు చెబితే అది మరింత గొడవలకు దారితీస్తుంది. అందుకే కొంచెం సర్దుకున్నాక, ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒకచోట కూర్చోపెట్టి అతని వలన భార్యగా తాను ఎంత ఇబ్బంది పడుతోందో చెప్పాలి. దానివలన కుటుంబంలో, పిల్లల్లో ఎన్ని డిస్టర్బెన్స్న్ వస్తున్నాయో వివరించాలి. భర్త ప్రవర్తనకు కారణాలేమిటో అడిగి తెలుసుకోవాలి. సానుకూల చర్చ వెంటనే కాకపోయినా నెమ్మదిగానైనా మార్పు తీసుకువస్తుంది.

చిన్నతనం వద్దు:

అవతలి వారి పెత్తనం మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. మానవసహజం ఇది. కానీ అలాంటప్పుడే దాన్ని భార్యలు కాపాడుకోవాలి. ఇతరులతో పోల్చోకోకూడదు, ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. దీనివలన శారీరకంగా, మానసికంగా కుంగిపోతారు. కాబట్టి ముందు స్ట్రాంగ్ గా అవడానికి ట్రై చేయాలి. ఇష్టమైన పనులు చేస్తూ, ప్రశాంతగా ఉండాలి.

ఆధారపడొద్దు:

ఆర్ధిక స్వేచ్ఛ….ఏ సంబంధంలో అయినా ఇది చాలా ముఖ్యం. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అన్నాడు మార్క్స్. ఇది అక్షరాల సత్యం. భార్యభర్త మధ్య కూడా ఇదే కీరోల్ పోషిస్తుంది. భర్తల మీద ఆధారపడే భార్యలంటే సహజంగానే చిన్నచూపు ఉంటుంది. ఆధారపడుతున్నారన్న భావన గౌరవం ఇవ్వదు. వాళ్ళ నిర్ణయాలకు, అభిప్రాయాలకు గౌరవం ఉండదు. అందుకే ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. ఎవ్వరి మీదా ఆధారపడకుండా ఉండాలి. అవతలి వ్యక్తి మీద ఎంత ప్రేమ, నమ్మకం ఉన్నా కూడా. ఎవ్వరూ ఎవ్వరికీ తలవంచాల్సిన పని లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సంపాదన డబ్బు కోసమే కాదు, ఆత్మగౌరవం కోసం కూడా. డబ్బులు ఎక్కువ ఉంటే కుటుంబానికి కూడా మంచిదే. దీని గురించి తమ అభిప్రాయం మీద భార్యలు స్ట్రాంగ్ ఉండాలి.

కౌన్సెలింగ్:

పైవేవీ వర్కౌట్ అవ్వకపోతే చివరి ప్రయత్నంగా కౌన్సెలింగ్ తీసుకోండి. భర్తలు గొడవపడుతున్నారు, పెత్తనం చెలాయిస్తున్నారు కదాని భార్యలు కూడా అదే చేయకూడదు. దానివలన బంధం తెగిపోతుంది తప్ప ఏ ఉపయోగమూ ఉండదు. కాబట్టి ఇద్దరూ కలిసి మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. భర్త ఒక్కరే వెళితే సరిపోతుంది అనుకోవద్దు. అతనితో పాటూ మీరూ వెళ్ళండి. కలిసి కూర్చుని మాట్లాడండి.అక్కడ ఇచ్చే ప్రత్యేక కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడుతుంది.