అక్కడ కరోనా కూల్.. టీ20 అక్కడే జరగొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

అక్కడ కరోనా కూల్.. టీ20 అక్కడే జరగొచ్చు

June 3, 2020

T2O Torney.

కరోనా వైరస్ కారణంగా టీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఈ ఆటలు సందిగ్ధంలో పడ్డాయి. దీంతో ఈసారి టీ20 లేనట్టేనని క్రికెట్ అభిమానులు నిరాశచెందారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ డీన్‌ జోన్స్‌ సరికొత్త ప్రతిపాదన వెలిబుచ్చాడు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న న్యూజిలాండ్‌లో టీ20 ప్రపంచకప్‌ జరుగొచ్చని బుధవారం ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ‘వచ్చేవారం అలెర్ట్‌ లెవెల్‌-1కు న్యూజిలాండ్‌ వెళ్లొచ్చని ప్రధాని జెసిండా చెప్పారు. భౌతిక దూరం నిబంధనలతో పాటు జన సమూహాలపై విధించిన నిషేధం కూడా తొలగిపోతుందని చెప్పారు. అక్కడ టీ20 ప్రపంచకప్‌ జరుగొచ్చు?’ అని జోన్స్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా, న్యూజిలాండ్‌ దేశ ప్రధాని జెసిండా అడెర్న్‌ టోర్నీపై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా దేశంలో కరోనా ప్రభావం తక్కువగా ఉంది. 12 రోజులుగా ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. దీంతో కొత్త కేసులు రాకపోతే వచ్చే వారం నుంచి ప్రజలు గుమిగూడేందుకు కూడా అనుమతిస్తాం’ అని ఆయన వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియాకు దగ్గరలో ఉన్న న్యూజిలాండ్‌లో టోర్నీ జరుగొచ్చని జోన్స్‌ అభిప్రాయం వ్యక్తంచేశాడు.