పోరాటం, స్వేచ్ఛ.. డియర్ కామ్రేడ్ ట్రైలర్.. - MicTv.in - Telugu News
mictv telugu

పోరాటం, స్వేచ్ఛ.. డియర్ కామ్రేడ్ ట్రైలర్..

July 11, 2019

‘ఒక కామ్రేడ్ పోరాడితే అతనికి ఆ పోరాటం హాయినివ్వాలి.. స్వేచ్ఛనివ్వాలి.. నిన్ను చూస్తే అలాగే వుంది’ అన్న డైలాగ్‌తో ‘డియర్ కామ్రేడ్’ ట్రైలర్ విడుదల అయింది. విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. విద్యార్థి ఉద్యమం, కుటుంబం, ప్రేమ, ఎమోషన్‌తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ‘వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉన్న ప్రేమ వెళ్లిపోయేటప్పుడు ఎందుకింత బాధ పెడుతోంది?’ అంటూ విజయ్‌ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మాస్ లుక్‌తో విజయ్ తన మార్క్ నటనతో అరిస్తున్నాడు. జులై 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. జయకృష్ణ మాటలు అందిస్తున్నారు.