Dear TTD devotees..The date of Srivari Brahmotsavam has been finalized
mictv telugu

టీటీడీ భక్తులారా..శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీ ఖారారు

July 12, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రెండున్నర సంవత్సరాలపాటు నిలిచిపోయిన శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది నిర్వహించాలని తాజాగా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల విషయంలో అధికారులు తీసుకున్న పలు ముఖ్యమైన విషయాలను భక్తులకు తెలియజేశారు.

అధికారులు మాట్లాడుతూ..”సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 27వ తేదీన జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబర్ 1న గరుడ సేవ, సర్వదర్శనం ప్రతీరోజులాగే కొనసాగుతుంది. స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఈసారి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరువీది ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం” అని అన్నారు.

ఇక, తిరుమలలోని పార్వేట మండపం ఆధునీకరణ కోసం రూ. 2.20 కోట్ల నిధులను కేటాయించినట్టు అధికారులు తెలిపారు. అమరావతిలోని శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్ధికి రూ.2.20 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. అంతేకాదు, టీటీడీ డైరీలు, క్యాలెండర్ల ముద్రణ బేడీ ఆంజనేయ స్వామి కవచాలకు బంగారు తాపడం, ఆనంద నిలయం బంగారు తాపడం పనులను ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు వివరించారు. దీని కోసం ఆగమశాస్త్రం పండితులతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే తిరుప్పావడ సేవను ప్రారంభిస్తామని వివరాలను వెల్లడించారు.