Dear TTD devotees..those darshans will be closed tomorrow: Dharma Reddy
mictv telugu

టీటీడీ భక్తులారా..రేపు ఆ దర్శనాలు బంద్: ధర్మారెడ్డి

July 11, 2022

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెంకన్న స్వామి భక్తులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. తిరుమలలో 12వ తేదీన (మంగళవారం) వీఐపీ బ్రేక్ దర్శనాలను బంద్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వీఐపీ దర్శనాలకు సంబంధించి సోమవారం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని అన్నారు.

టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..” రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశాం. నేడు ఎటువంటి సిఫార్స్ లేఖలు తీసుకోము. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కరోనా ప్రభావంతో తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్టు 1నుంచి పునఃప్రారంభిస్తాం. జూన్‌లో శ్రీవారిని 23.23 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో స్వామివారి హూండీ ఆదాయం రూ.123.74 కోట్ల కానుకలుగా వచ్చాయి” అని ఆయన అన్నారు.

మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయాయని, క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరినట్లు వివరాలను వెల్లడించారు.