Suspicious death of Lady Doctor at Nizamabad Government Hospital
mictv telugu

నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో లేడీ డాక్టర్ అనుమానాస్పద మృతి

May 13, 2022

Suspicious death of Lady Doctor at Nizamabad Government Hospital

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత అనుమానాస్పదంగా మృతి చెందారు. ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ ఆమె డ్యూటీలోనే ఉన్నారు. ఆ తర్వాత తన గదికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. తెల్లవారుజామున చూసేప్పటికి ఆమె విగతజీవిగా కనిపించడం చూసి తోటి వైద్య విద్యార్థినులు షాక్ అయ్యారు. గుండెపోటుతో డాక్టర్ శ్వేత చనిపోయినట్లుగా తెలుస్తోంది. లేక మరేదైనా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన శ్వేత గైనిక్ విభాగంలో పీజీ చేస్తూ నిజామాబాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. తమతో పాటు కలిసి పనిచేసే తోటి డాక్టర్ హఠాత్తుగా చనిపోయే సరికి తోటి జూనియర్ డాక్టర్లు అంతా విషాదంలో నిండి ఉన్నారు. ఆమె మరణం పట్ల నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్వేత చాలా చలాకీగా ఉండేవారని..ఆమెలో ఎప్పుడు డిప్రెషన్ వంటిది చూడలేదని ఆమె మరణం చాలా బాధాకరం అని అన్నారు.