జంగారెడ్డి గూడెంలో మృత్యు ఘోష.. 18కి చేరిన సంఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

జంగారెడ్డి గూడెంలో మృత్యు ఘోష.. 18కి చేరిన సంఖ్య

March 12, 2022

bgbf

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో క‌ల్తీసారా తాగి, మూడు రోజుల వ్య‌వ‌ధిలో 16 మంది మృతి చెందడం అందరినీ విస్మయానికి గురిచేసింది. విషయం తెలుసుకున్న అధికారులు మృతికి సంబంధించిన కార‌ణాలపై ద‌ర్యాప్తును వేగవంతం చేశారు. తమ దర్యాప్తులో మ‌ృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున అనిల్ అనే వ్యక్తి మరణించాడు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉపేంద్ర మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 18కి చేరిందని అన్నారు.

మరోవైపు నాటుసారా మరణాలపై విచారణ కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికీ వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వరదరాజుల పరిస్థితి విషమంగా ఉంది. వరదరాజుల అవయవాలేవీ పని చేయట్లేదని వైద్యులు తెలిపారు.