రాష్ట్రాలు, యూటీల పోలీసు విభాగాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఒక నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం 2021లో భారతదేశంలో 4 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
2021 క్యాలెండర్ ఇయర్ లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య 4, 12, 432గా నమోదైంది. దీనివల్ల 1,53,972మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448మంది గాయపడ్డారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీలు)పోలీసు విభాగాల నుంచి సేకరించిన రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ డేటా రూపొందించింది. అయితే ‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు -2021’ అనే నివేదిక 2019తో కాకపోతే మరణాలు మాత్రం 1.9శాతం పెరిగాయి.
లాక్ డౌన్ కారణంగా..
2021లో దేశంలో ప్రతిరోజూ 1,130 ప్రమాదాలు, 422 మరణాలు జరిగాయి. అంటే ప్రతి గంటకు 18 మరణాలు, 47 చొప్పున ప్రమాదాలు సంభవించాయి. ఈ సంఖ్య 2019తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. కాకపోతే 2021 నాటికి బాధితుల వయసును పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఆందోళన చెందించేదిగా ఉంది. 18-45 సంవత్సరాల వయసు గల వారు ప్రమాదాలలో 67.6శాతం, 18-60 సంవత్సరాల వయసు గలవారు మొత్తం 84.5శాతం ప్రమాదాలకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాలు తగ్గడానికి కారణం కూడా లేకపోలేదు. 2020లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల వాహనాల రాకపోకలు తగ్గి ప్రమాదాల సంఖ్య తగ్గింది.
టాప్ లో..
రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. జాతీయ రహదారులపై తమినాళనాడులో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఈ నివేదిక చెబుతున్నది. అంతేకాకుండా.. మిజోరాం, బీహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రమాదాల కారణంగా తీవ్రంగా గాయపడ్డ వారి సంఖ్య ఎక్కువ ఉంది. మొత్తం మరణాల్లో 69.6శాతం, ఆ తర్వాత వాహనాన్ని రాంగ్ సైడ్ 5.2శాతం నడపడం వల్ల మరణాలు సంభవించాయి. ఇవికాకుండా వాహనాల అతివేగం కూడా మరణాలు సంభవించినట్లు తెలుస్తున్నది. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలంటే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను, మార్గదర్శకాలను అనుసరించి జాగ్రత్త వహించాలని రోడ్డు, రవాణా సంస్థ కోరుతున్నది.