Debate On UK PM Rishisunak
mictv telugu

రిషి సునాక్..మావాడు అంటే మావాడు..అక్కడ సెలబ్రేషన్స్…ఇక్కడ మాటల మంటలు..!

October 26, 2022

Debate On UK PM Rishisunak

బ్రిటన్ ప్రధాని మావాడు అంటే మావాడు అంటూ భారత్ , పాక్ లు పోటీపడి ప్రచారం చేసుకుంటున్నాయి. క్లెయిమ్ చేసుకోవడానికి స్టేట్‌మెంట్ల పరంపర కొనసాగిస్తున్నాయి. రిషి తమ సంతతికి చెందిన వారని భారత్ క్లెయిమ్ చేస్తోంది. లేదు లేదు పంజాబ్ ప్రావిన్స్ ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది కాబట్టి తమవాడేనని ఆ దేశం అంటోంది. మీడియా బ్యానర్ ఐటెమ్స్ , స్టోరీలతో కుమ్మేస్తోంది. మరోవైపు రిషి సునాక్ పై భారత్‌లో అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.

రిషి పేరెంట్స్ చరిత్ర

Debate On UK PM Rishisunak

సౌతాంఫ్టన్‌లో పుట్టిన రిషి వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారు. తండ్రి యశ్‌వీర్ డాక్టర్.తల్లి ఫార్మసిస్ట్. రిషి తండ్రి కెన్యాలో పుట్టిపెరిగారు. తల్లి టాంజనియాకు చెందినవారు. వీరి పూర్వీకులు పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వాళ్లు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్ లో ఉంది.భారత్ నుంచి పాక్ విడిపోకముందు వారు ఇక్కడ నివసించారు. 2009లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు.భారతీయ సంప్రదాయాలు అంటే రిషి సునాక్‌కు చాలా గౌరవం.దీన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

పాక్ వాదన

రిషి సునాక్‌ని పాకిస్థాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. పంజాబ్ ప్రావిన్స్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది కాబట్టి తమవాడే అంటోంది. రిషి గురించి అక్కడ పేపర్లు గొప్పగా రాసుకుంటున్నాయి.

బీజేపీ వెర్షన్

Debate On UK PM Rishisunak

రిషి సునాక్ భారత సంతతికి చెందిన వారని బీజేపీ అంటోంది. భారతీయ సంప్రదాయాలపై ఎనలేని గౌరవం వుందని చెబుతోంది. అంతే కాదు నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తిని పెళ్లిచేసుకుని మరింత దగ్గరయ్యారని అంటోంది.

ఓవైసీ ఛాలెంజ్

Debate On UK PM Rishisunak

రిషి సునాక్ పై బీజేపీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. బ్రిటన్ మైనారిటీ అభ్యర్థిని ప్రధానిని చేసిందన్నారు. దమ్ముంటే బీజేపీ మైనారిటీ అభ్యర్థిని ప్రధానిని చేయాలని ఛాలెంజ్ చేశారు. అది కూడా హిజాబ్ ధరించిన మహిళకు ఛాన్స్ ఇవ్వాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
బీజేపీ కౌంటర్
అసదుద్దీన్ వ్యాఖ్యల్ని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఖండించారు. “అసద్ కొత్త స్టేట్ మెంట్లు ఇవ్వడంలో ఎక్స్ పర్ట్.ఐక్యమత్యంగా వుంటున్న హిందూ,ముస్లింల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు.ఇప్పుడు కాదు దేశం ఎప్పుడో మైనారిటీ వ్యక్తిని ప్రధానిని, రాష్ట్రపతిని చేసింది. జాకీర్ హుస్సేన్ , అబ్దుల్ కలామ్ ,మన్మోసింగ్ లాంటి నేతలు దేశ అత్యున్న పదవులు అలకరించారు”అని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ కౌంటర్ ఇచ్చారు.