Deceased candidate elected sarpanch of Kurukshetra village
mictv telugu

చనిపోయిన వ్యక్తిని సర్పంచ్‌గా గెలిపించారు

November 15, 2022

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన ఓ వ్యక్తి.. ఎన్నికలకు వారం రోజుల ముందు అకస్మాత్తుగా మరణించారు. ఆయనపై ఉన్న సానుభూతితో గ్రామస్థులు మరణించిన వ్యక్తికే ఓటేసి గెలిపించారు. ఈ ఘటన హరియాణాలోని కురుక్షేత్ర జిల్లా జన్‌దేడీ గ్రామంలో ఈ అరుదైన ఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో రెండో విడతలో భాగంగా కురుక్షేత్ర జిల్లాలో నవంబరు 12న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు తర్వాత వచ్చిన ఫలితాలను ఎన్నికల అధికారులు షాకయ్యారు.

జన్దేడీ పంచాయతీ సర్పంచ్ పదవికి ముగ్గురు పోటీ చేశారు. అందులో మృతుడు రాజ్‌బీర్‌ ఒకరు. అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజ్‌బీర్ సింగ్.. ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు మెదడులో నరాలు చిట్లి పోలింగ్కు వారం క్రితమే మరణించారు. నవంబర్ 12న జరిగిన ఎన్నికల్లో మృతుడు రాజ్‌బీర్‌ సింగ్‌కే గ్రామస్థులు ఓటు వేసి గెలిపించారు. పోటీలో ఉన్న మరో ఇద్దరు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆ ఊరిలో మొత్తం 1,790 ఓట్లు ఉండగా.. అందులో 1660 ఓట్లు పోలయ్యాయి. మెజార్టీ ఓట్లు మృతుడు రాజ్‌బీర్‌ సింగ్ పొంది విజయం సాధించారు. మృతుడికి 17 ఏళ్ల కుమార్తె, 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో రాజ్వీర్ సింగ్ భార్యను గెలిపిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు. రాజ్‌బీర్‌ సంతానానికి ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన వయసులేదని అన్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల్లో జన్వాడీ పంచాయతీకి మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.