కుళ్లిపోయిన మటన్‌తో చేసిన బిర్యానీతో బఫెట్ ఏర్పాటుచేశారని సెక్రటేరియట్ ఎదురుగా వున్న అమోఘం హోటల్లో కష్టమర్లు ఆందోళనకు దిగారు. లుంబినీ పార్క గేటు పక్కనే వున్న ఆ హోటల్లో అన్ లిమిటెడ్ ఫుడ్ పేరుతో హోటల్ యాజమాన్యం భోజనం ఏర్పాటు చేస్తుంది. కష్టమర్లు ఎవరికి నచ్చింది వారు వేసుకుని తినవచ్చు. అయితే హోటల్లో కుళ్లిపోయిన మాంసంతో వండిన మటన్ బిర్యానీ పెట్టడంతో కష్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
హోటల్ యాజమాన్యం కూడా కష్టమర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో కష్టమర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లి హోటల్లోని ఆహారాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కుళ్లిపోయిన మాంసంతో బిర్యానీ వడ్డించడం ఇప్పుడే కాదని గతంలో కూడా ఇలా చేశారని ఆరోపిస్తున్నారు కష్టమర్లు. బయటి హోటళ్లతో పోల్చుకుంటే అమోఘంలో రేట్లు కూడా ఎక్కువే అంటున్నారు.