వెంకన్న సన్నిధిలో దీపిక, రణవీర్ - MicTv.in - Telugu News
mictv telugu

వెంకన్న సన్నిధిలో దీపిక, రణవీర్

November 14, 2019

బాలీవుడ్ ప్రేమ జంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌లు వివాహబంధంతో ఒక్కటై ఏడాది గడిచిపోయింది. తమ తొలి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరిద్దరూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తరువాత ఆలయం వెలుపల వారు ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గత ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో కొంకణి, సింధు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి ఇటలీలో జరిగింది. వివాహానంతరం బెంగళూరు, ముంబైలో వారు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే దీపికా ప్రస్తుతం మేఘ గుల్జార్ దర్శకత్వంలో ‘చపక్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. రణవీర్ సింగ్ ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో ’83’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడం నేపథ్యంలో తీసున్నారు. అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు.