డ్రగ్ కేసు విచారణకు వచ్చిన దీపికా పదుకొణే - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్ కేసు విచారణకు వచ్చిన దీపికా పదుకొణే

September 26, 2020

gnhvm

బాలీవుడ్‌లో సంచంలనం రేపుతున్న డ్రగ్ కేసు విచారణ వేగాన్ని పెంచారు ఎన్సీబీ అధికారులు. ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను విచారించిన అధికారులు నేడు దీపికా పదుకొణేను పిలిచారు. దీంతో ఆమె శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసుకు వచ్చారు. ముంబైలోని కొలబా ప్రాంతంలో ఉన్న అపోలో బండర్ లోని ఎవ్లిన్ గెస్ట్‌హౌజ్‌లో దీపికను విచారిస్తున్నారు. ఆమె చాటింగ్, ఇతర విషయాలపై ఆరా తీయనున్నారు. 

ఇప్పటికే దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను శుక్రవారం ప్రశ్నించారు. ఆమెను ఇవాళ కూడా  మరోసారి విచారించే అవకాశాలు ఉన్నాయి. రియా చక్రవర్తితో జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా రకుల్‌, కర్మిషాలను ఎన్సీబీ విచారించింది. ఈ కేసులో సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా పేరు రావడంతో ఈ కేసు డ్రగ్ వైపునకు మళ్లిన సంగతి తెలిసిందే.