Deepika Padukone bought a house for 119 crores in mumbai
mictv telugu

రికార్డు స్థాయిలో డబ్బు పెట్టి ఫ్లాట్ కొన్న బాలీవుడ్ జంట

July 11, 2022

బాలీవుడ్ భార్యాభర్తలు రణవీర్ సింగ్ – దీపికా పదుకొణేలు ముంబైలో ఖరీదైన ఫ్లాటును కొన్నారు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో రూ. 119 కోట్లతో కొనుగోలు చేశారు. దేశం మొత్తం మీద ఒక అపార్ట్‌మెంటులో ఇంత ధర పెట్టి ఫ్లాటు కొనడం ఇదే రికార్డుగా చెప్తున్నారు. సీ వ్యూ ఉండడంతో ఇంత ధర పెట్టినట్టు తెలుస్తోంది. 16,17,18,19 అంతస్థులు కలిపి ఒకే ఫ్లాటుగా ఉండే ఫ్లాటును క్వాడ్రప్లెక్స్ అంటారని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. వీరి ఫ్లాటుకు పక్కన సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్, ఇటు పక్కన షారూఖ్ ఖాన్‌కు చెందిన మనత్ బంగ్లా మధ్య వీరి ఇల్లు ఉంది. మొత్తం విస్తీర్ణం 11,266 అడుగులుగా ఉంది.