కాళ్లు ఇస్తా.. కర్ణిసేనకు దీపిక బంపర్ ఆఫర్..! - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్లు ఇస్తా.. కర్ణిసేనకు దీపిక బంపర్ ఆఫర్..!

February 2, 2018

సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘పద్మావత్’ చిత్రం విడుదలై వారం దాటిపోయినా రాజ్ పుత్ కర్ణిసేన, ఇతర హిందూ సంఘాలు నిరసనలు కొనసాగిస్తూ`నే ఉన్నాయి. అందులో రాణి పద్మావతికి, రాజపుత్రులకు వ్యతిరేకంగా ఏమీ లేకపోయినా సినిమాను ఆడనివ్వబోమంటున్నారు. ఈ నేపథ్యంలో పద్మావత్‌గా నటించిన దీపిక ఓ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేసింది…తన తలను నరికి, ముక్కుకోస్తే కోట్ల నజరాలు చెల్లిస్తామని ప్రకటించిన వారికి చురకలు అంటించింది. ‘నా తల, ముక్కు నరికితే డబ్బులు ఇస్తామన్నారు మహానుభావులు. కానీ నా నా ముక్కంటే చాలా ఇష్టం. అది కోయొద్దు.. కావాలంటే నా కాళ్లు ఇస్తా.. అవి చాలా పొడవుగా ఉన్నాయి.. వాటిని తీసుకోండి..’ అని ఎద్దేవా చేసింది.

అదే సమయంలో తాను ఎవరికీ భయపడేదానిని కానని స్పష్టం చేసింది. 14 ఏళ్ల వయసున్నప్పుడు తనను ఉద్దేశపూర్వకంగా తోసుకుంటూ వెళ్లిన వ్యక్తిని చెంపలు వాయించనని తెలిపింది. అమ్మాయిలు అలానే ఉండాలని, ఎలాంటి ఆధిపత్యాన్నీ సహించకూడదని కోరింది. ‘పద్మావత్ ను అభిజాత్యం, ధైర్యం గురించి ఈ సినిమాలో  చూనించాం.  ఆమె నుంచి మన అమ్మాయిలు చాలా నేర్చుకోవాలి. చేతిలో ఖడ్గం లేకపోయినా పోరాడగలిగే యోధురాలు ఆమె..’ అని దీపిక చెప్పిది.