నవంబర్‌లోనే దీపికా, రణ్‌వీర్ పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్‌లోనే దీపికా, రణ్‌వీర్ పెళ్లి..

October 21, 2018

బాలీవుడ్‌ భామ దీపికా పదుకోన్‌, రణ్‌వీర్ సింగ్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసిన అభిమానులకు ఆమె ట్విటర్ ద్వారా తీపి వార్త చెప్పింది దీపికా.. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నవంబర్ 14,15వ తేదీల్లో మా పెళ్లి జరగబోతోందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లు మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ప్రేమ, స్నేహం, నమ్మకంతో మేం కలిసి చేయబోతున్న ఈ ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.. ప్రేమతో మీ దీపిక, రణ్‌వీర్‌’ అంటూ పెళ్లి కార్డును కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.Deepika Padukone, Ranveer Singh confirm November wedding, announce date on Twitterదీపిక, రణ్‌వీర్ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై వీరిద్దరూ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల ఓ ఇంటర్వూలో దీపిక, రణ్‌వీర్‌ వద్ద పెళ్లి  ప్రస్తావన తీసుకురాగా.. ‘ పెళ్లి ఎప్పుడు జరిగితే అప్పుడు మీకే మందు తెలుస్తుంది’అని పేర్కొన్నారు. వీరి పెళ్లి వార్త విన్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన జంట పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉందని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.