బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్ట్‌బీట్ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం వైద్య బృందం ఆమెను అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై దీపికా పదుకొనే క్లారిటీ ఇచ్చినట్టు ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
రెగ్యులర్ చెకప్‌లో భాగంగా 3 రోజుల క్రితం దీపికా పదుకొనే కామినేని ఆసుపత్రికి వెళ్లిందట. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రంలో దీపిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. షూటింగ్లో ఉండగా ఒక్కసారిగా ఆమె హార్ట్‌రేట్ పెరగడంతో కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం డిశార్చి చేసి, నోవాలెట్ హోటల్లో అబ్జర్వేషన్లో ఉంచినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.