సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారుతావా దీపికా? - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారుతావా దీపికా?

January 19, 2020

Deepika Padukone.

దీపికా పడుకొనె ప్రధాన పాత్రలో నటించిన ‘ఛపాక్’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ కథతో రూపొందిన ఈ సినిమాలో దీపిక నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. అంతా బాగున్న సమయంలో దీపిక చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సినిమా ప్రమోషన్‌ కోసం దీపికా చాలామంది టిక్‌టాక్ స్టార్లను కలిసింది. అందులో ఒకరిని తన సినిమాల్లో గెటప్‌లకు టిక్‌టాక్ చేయాలని కోరింది. ఓం శాంతి ఓంలోని పాత్ర, పీకూలో పాత్ర, మూడోది ఛపాక్ సినిమాలోని లక్ష్మీ అగర్వాల్ పాత్ర చేయమని కోరింది. అవి తనకు ఇష్టమైన పాత్రలు అని కూడా చెప్పింది.  దీపిక విసిరిన చాలెంజ్‌ను ఫాబీ అనే ఓ మేకప్ ఆర్టిస్ట్ స్వీకరించింది. 

ఇంకేం మేకప్‌లు మారుస్తూ దీపిక చెప్పిన గెటప్‌లతో 39  సెంకడ్ల నిడివి గల టిక్‌టాక్ వీడియో తీసి పోస్టు చేసింది. దీనిని చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం దీపికా దిగజారుతోందని కామెంట్లు చేస్తున్నారు. ‘ఛపాక్‌లో యాసిడ్ దాడి జరిగిన ముఖంతో టిక్‌టాక్ చేయమని చెప్పడం ఏ రకమైన ప్రమోషన్ ఆలోచించావా?’ అంటూ ఓ నెటిజన్ ఘాటుగా ప్రశ్నించాడు. ‘ఇలా చేయడం కచ్చితంగా యాసిడ్‌ దాడి బాధితుల్ని కించపరచడమే’, ‘నిన్నుచూస్తే సిగ్గు అనిపిస్తోంది’, ‘ఇలాంటి ప్రమోషన్లు చిల్లరగా ఉంటాయి’, ‘ఆ సినిమా నీ మేకప్‌కు సంబంధించింది కాదు. ఓ యాసిడ్‌ బాధితురాలి  జీవితం. ఇలాంటి ప్రమోషన్‌తో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయావు ఛీ..’, ‘జేఎన్‌యూను సందర్శించడం కూడా ప్రమోషన్‌ కోసమే’ అంటూ కామెంట్లతో దాడి చేసినంత పనే చేశారు.