'కిలో మైసూర్ పాక్ తీసుకొని రండి'..భర్త పోస్ట్‌పై దీపిక కామెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కిలో మైసూర్ పాక్ తీసుకొని రండి’..భర్త పోస్ట్‌పై దీపిక కామెంట్

January 27, 2020

jkhjkh

బాలీవుడ్ లవ్లీ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె భార్యభర్తలుగా ఫన్నీగా ఉంటారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. తాజాగా మరోసారి ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. భారత క్రికెట్ జట్టు 1983లో వరల్డ్ కప్ గెలిచిన సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ’83’. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం రణ్‌వీర్ చెన్నై వెళ్ళాడు. అక్కడ దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై దీపిక ఫన్నీ కామెంట్ చేసింది. వచ్చేటప్పుడు..శ్రీకృష్ణ స్వీట్స్ షాప్ నుంచి కిలో మైసూర్ పాక్, హాట్ చిప్స్ నుంచి ఆలు చిప్స్ తీసుకురావడం మర్చిపోవద్దు అని కామెంట్ చేసింది. దీపిక కామెంట్‌పై స్పందించిన దర్శకుడు కబీర్ ఖాన్ భార్య మిని మాథుర్.. మీరు కూడా ఇవన్నీ తీసుకురండి అని తన భర్త కబీర్ ఖాన్‌ను కోరింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.