స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన బాలీవుడ్ నటి - MicTv.in - Telugu News
mictv telugu

స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన బాలీవుడ్ నటి

January 16, 2020

NBBG

బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఉన్మాదులకు యాసిడ్‌ ఎలా దొరుకుందనే దానిపై ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. యాసిడ్ దొరికే కొన్ని షాపులను గుర్తించి తమ టీమ్‌ సభ్యులను పంపించారు. వారికి రహస్య కెమెరాలను అమర్ఛి.. కారులో నుంచి కమాండ్ చేశారు. 

ఈ ఆపరేషన్‌లో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి ఆధారాలు ఇవ్వకుండానే 24 యాసిడ్ బాటిళ్లను దీపికా టీమ్ కొనుగోలు చేసింది. పవర్‌ఫుల్ యాసిడ్ ఉందా అని ఓ యువకుడు వెళ్లి ఓ దుకాణం యజమానిని అడగ్గా.. ఆ షాపు యజమాని వెంటనే యాసిడ్‌ తీసి ఇస్తున్నాడు. ఎందుకు?… ఎవరు ?.. అనే కనీస ప్రశ్నలు కూడా అడగకుండా యాసిడ్‌ అమ్ముతున్నాడు. పైగా అతన్ని దబాయించి మరీ ఆ యువకుడు యాసిడ్ బాటిల్‌ను కొనుగోలు చేయగలిగాడు. యజమాని ముందే యాసిడ్‌ పవర్‌ను పరీక్షించాడు. 

అయితే ప్రమాదకరమైన యాసిడ్ బాటిళ్ల విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల దీపిక నటించిన ‘చపాక్’ చిత్రం యాసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరక్కెక్కింది. తనపై యాసిడ్ దాడి తరువాత లక్ష్మి అగర్వాల్.. బహిరంగ యాసిడ్ అమ్మకాలపై ఉద్యమం చేశారు. దీంతో సరైన అధరాలు లేకుండా యాసిడ్ అమ్మరాదని సుప్రీం కోర్టు ప్రకటించింది. అయినా కూడా మహిళలపై యాసిడ్ దాడులు ఆగలేదు. తాజాగా దీపిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌తో యాసిడ్ దుకాణాల పని తీరు మరోసారి బట్టబయలైంది.