దీపకాంతుల్లో అయోధ్య.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం - MicTv.in - Telugu News
mictv telugu

దీపకాంతుల్లో అయోధ్య.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం

October 24, 2022

 

Deepotsav 2022: Ayodhya set up Guinness World Record for lighting up over 15 lakh diyas

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ‘దీపోత్సవ్‌’లో భాగంగా సరయూ నది ఒడ్డున వెలిగించిన 15లక్షల మట్టి ప్రమిదల దీపకాంతుల్లో అయోధ్య నగరం ధగధగ మెరిసిపోయింది. ప్రతి ఏడాదిలానే, ఈసారి కూడా అయోధ్య నగరంతో పాటు సరయు నది తీరంలో దీపోత్సవం వెలుగుల పండుగలా జరిగింది. దీపావళి నాడు అయోధ్యలో దీపోత్సవ్ పేరిట భారీ ఎత్తున వేడుక జరుపుకోవడం ఇది ఆరోసారి. ఈ సారి దీపావళి పండగకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

Deepotsav 2022: Ayodhya set up Guinness World Record for lighting up over 15 lakh diyas

ఆదివారం అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ దీపోత్సవ్‌ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. దీపోత్సవ్‌ వేళ సుందరంగా తీర్చిదిద్దిన సరయూ నది ఒడ్డు న వివిధ ఆకృతుల్లో దీపాలను అమర్చి వెలిగాంచారు. 22 వేల మంది వలంటీర్లు 18 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగించి గిన్నిస్ రికార్డును సృష్టించారు. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్భంగా బాణసంచా కాల్చడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజికల్‌ లేజర్‌ షో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.